Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కన్నతల్లిని చంపి తల నరికి రోడ్డుపై పడేసిన ఆస్ట్రేలియా అమ్మాయి

  • సిడ్నీలో దారుణం
  • తల్లిని బలితీసుకున్న మానసిక రోగి!
  • ఘటనా స్థలిని చూసి దిగ్భ్రాంతి చెందిన పోలీసులు
ఆస్ట్రేలియా లో దారుణం చోటుచేసుకుంది. 25 ఏళ్ల అమ్మాయి తన తల్లిని హత్య చేయడమే కాకుండా, తల నరికి ఇంటి ముందున్న రోడ్డుపై పడేసిన వైనం పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. సిడ్నీ పోలీసులు శనివారం రాత్రి ఓ ఇంట్లో 57 ఏళ్ల మహిళ మొండేన్ని కనుగొన్నారు. ఈ ఘటనలో మృతురాలి కుమార్తెను అరెస్ట్ చేశారు. తల్లి తలను పొరుగింటి గార్డెన్ కు ఎదురుగా ఉన్న ఫుట్ పాత్ పై పారవేస్తుండగా ఓ బాలుడు చూశాడు.

కుమార్తెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు హాజరు పరిచిన పోలీసులు అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె మానసిక పరిస్థితి సరిగాలేదని భావిస్తున్నారు. కాగా, ఆమె తన తల్లి తలతో ఇంటి బయటికి రావడాన్ని నాలుగేళ్ల బాలుడు చూడడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ చిన్నారి కూడా హంతకురాలికి బంధువే. భయంతో పరుగు తీసే క్రమంలో కిందపడిన బాలుడి తలకు దెబ్బతగలడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇంతటి ఘోరమైన హత్యను ఎన్నడూ చూడలేదని సిడ్నీ పోలీసులు చెబుతున్నారు.
Australia
Sydney

More Telugu News